"బాలానందం " ...76 వ వార్షికోవత్సవం

updated: February 20, 2018 19:20 IST

పిల్లలకి తెలుగుదనంతో పాటు విజ్ఞానం, వినోదం రుచి చూపించిన " ఆంధ్ర బాలానంధ సంఘం " 1940 లో స్థాపించారు.. రేడియో అన్నయ్య శ్రీ న్యాయపతి రాఘవరావు గారు. బాలానందం అంటే పిల్లల   సంతోషం కోసం...అనే లక్ష్యంతో , ఆశయంతో మొదలు పెట్టబడిన ఈ సంఘం... లక్ష్యాన్ని నూటికి నూరుపాళ్ళు సాధించింది. ఎంతలా అంటే... ఒక తరం తెలుగు బాలల వ్యక్తిత్వాలనే మార్చివేయగలిగేయటంత.  బాలల్లో ఒక కొత్త స్పూర్తి, ఒరవడిని కల్పించారు, చక్కటి వ్యక్తిత్వాన్ని ఆపాదించారు, తెలుగు భాషని అందించారు. ఇలా జన హృదయాలని ఆకట్టుకుని ఏళ్ళ పాటు కార్యక్రమాలని నిర్వర్తించడం సామాన్య మైన విషయం మాత్రం కాదు. 

ఇప్పుడీ బాలానందం...76వ వార్షికోవత్సవం జరుపుకుంటోంది. హైదరాబాద్ లోని రవీంద్ర భావతి ఇందుకు వేడుక కానుంది. మిగతా   వివరాలు క్రింద మీరు చూడవచ్చు. 

ఆంధ్ర బాలనంద సంఘం లో నిర్వహిస్తున్న కార్యక్రమాల స్ఫూర్తిని గౌరవిస్తూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం  కొంత ఫండ్ ని మంజూరు చేసింది. ఆ  డబ్బుతో బాలానందం హాల్ నిర్మించారు. ఇది నేటికీ జంట నగరాలలో బాలల కార్యక్రమాలకు కేంద్రంగా కొనసాగుతోంది. ఈ ఘనత రేడియో అన్నయ్య గారిదీ, తరువాత ఈ సంస్థను నిర్వాహిస్తున్న నిర్వాహకులది అని చెప్పవచ్చు.

న్యాపతి రాఘవరావు రచించిన బాలగేయం ...

అనగా అనగా ఒక చిచ్చు 

దీపావళికే ఇది వచ్చు

వస్తే మనకెంతో డబ్బు ఖర్చు 

ఇంట్లో ఒక బొచ్చు కుక్క ఉండొచ్చు 

చిచ్చు వెలిగిస్తే దాని బొచ్చు అంటుకోవచ్చు 

మీ ఇంట్లో దోమలు ఉండొచ్చు 

చిచ్చు పొగకి దోమలు చచ్చు- కాని 

గదిలో కాల్చొచ్చని మీరనుకోవచ్చు 

గచ్చుమీద కాలిస్తే గచ్చు పెచ్చులూడొచ్చు 

అది గాక ఇంటికి డేంజర్ హెచ్చు 

కనుక బాలలూ! ఈ చిచ్చును 

కొనకుంటేనే మీ పెద్దలు మెచ్చు

comments